ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజపక్స స్వదేశానికి వస్తారు...కానీ ఎపుడన్నది చెప్పలేం

international |  Suryaa Desk  | Published : Wed, Jul 27, 2022, 10:42 PM

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స స్వదేశానికి వచ్చే అవకాశముందని శ్రీలంక కేబినేట ప్రతినిధి ఒక్కరు వెల్లడించారు. కానీ ఎపుడు వస్తారు అన్నది కచ్చితంగా చెప్పలేమని కూడా వెల్లడించారు. ఇదిలావుంటే శ్రీలంక ప్రజల ఆగ్రహానికి గురైన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. శ్రీలంక నుంచి మాల్దీవులకు, అక్కడి నుంచి సింగపూర్ కు వెళ్లారు. సింగపూర్ ఆయనకు 14 రోజుల తాత్కాలిక వీసాను మంజూరు చేసింది. తాజాగా ఆ వీసాను మరో 14 రోజులు పొడిగించింది. ఆయనకు సంబంధించి ఒక కీలక విషయాన్ని శ్రీలంక కేబినెట్ ప్రతినిధి గుణవర్దన వెల్లడించారు. 


త్వరలోనే గొటబాయ రాజపక్స సింగపూర్ నుంచి శ్రీలంకకు వస్తారని ఆయన తెలిపారు. అయితే, కచ్చితంగా ఎప్పుడు వస్తారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. మరోవైపు, గొటబాయ రాజీనామాతో ఇటీవలే శ్రీలంక అధ్యక్షుడి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రణిల్ విక్రమసింఘే గెలుపొందారు. అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలను నిర్వహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com