ఫైబర్ నెట్‌వర్క్‌ను పెంచుకోవడానికి BSNLని భారత్ బ్రాడ్‌బ్యాండ్ నిగమ్ లిమిటెడ్‌తో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌కు రూ.1.64 లక్షల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది.ఇప్పటికే ఉన్న సేవలను మెరుగుపరచడానికి మరియు 4G సేవలను అందించడానికి, బి.ఎస్.ఎన్.ఎల్ ఈక్విటీ ఇన్ఫ్యూషన్ ద్వారా రూ. 44,993 కోట్లతో పరిపాలనాపరంగా 900/1800 MHz బ్యాండ్‌లో స్పెక్ట్రమ్‌ను కేటాయించబడుతుంది" అని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తెలిపింది.