రాజమహేంద్రవరం బ్రిడ్జిపై ఇక నుంచి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. 2.9 కిలోమీటర్ల పొడవు గల ఈ బ్రిడ్జిపై రైలు పట్టాల కింద ఉండే స్లీపర్లను ఇటీవల మార్చడం ద్వారా ట్రాక్‌ను మరింత పటిష్ఠంగా మారింది.
దీంతో వంతెనపై నుంచి వెళ్లే రైళ్ల గరిష్ఠ వేగాన్ని 50 కిలోమీటర్లకు పెంచినట్టు దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. గోదావరి నదిపై గోదావరి-కొవ్వూరు స్టేషన్ల మధ్య ఈ వంతెన ఉంది.