ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. జిల్లాలోని దర్శి మండలం వెంకటాచలంపల్లి వద్ద ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. అందులో ఉన్న 30 మంది సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి కనిగిరి వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు వెంకటాచలంపల్లి వద్ద అతివేగంగా వచ్చి బోల్తా పడింది. 8మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు.