సీతాఫలంలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో పుష్కలంగా పోషకాలున్నాయి. విటమిన్ సీ, ఏ, పొటాషియం, మెగ్నీషియం వంటివి మన ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. సీతాఫలం ఈ కాలంలో ఎక్కువగా లభిస్తుంది. అయితే దీనిని తింటే జలుబు చేస్తుందని కొందరు, షుగర్ వ్యాధి వస్తుందని మరికొందరు అంటూ ఉంటారు. అవన్నీ కూడా అపోహలు మాత్రమే. సీతాఫలం తినకపోతే ఎన్నో పోషకాల్ని మనం మిస్సవుతాము. ప్రతి ఒక్కరూ దీనిని తింటే ఎంతో మంచిది.