వెల్లుల్లిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే పరిమితికి మించి తింటే నష్టాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిని ఎక్కువగా తింటే విరేచనాలు, వాంతులు, కడుపులో నొప్పి వంటి తలెత్తుతాయి. మోతాదుకు మించి వెల్లుల్లి తింటే కాలేయం పనితీరు దెబ్బతింటుంది. 'లో బీపీ', తల తిరగడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. బాలింతలు, గర్భిణులు, చిన్నారులు పచ్చి వెల్లుల్లి తినకపోవడం మంచిది.