national | Suryaa Desk | Published :
Sat, Jul 30, 2022, 07:35 AM
ఉత్తరప్రదేశ్ లోని గిర్వా పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కారు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com