ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆగస్టు 1వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్ టికెట్లను విడుదల చేయనున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం 600 టికెట్లను ఆన్‌లైన్ ద్వారా జారీ చేసిన టీటీడీ, ఒక్కో టికెట్‌కు రూ.2,500 ధర నిర్ణయించింది. ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలి.