కావలసిన పదార్దాలు : బీరకాయ తొక్కలు - 1 కప్, వెల్లుల్లి - 4, కరివేపాకు ఆకులు - గుప్పెడు, నూనె - తగినంత, టమాటో - 1, పచ్చిమిర్చి - 10, ఆవాలు - అరస్పూన్, జీలకర్ర - అరస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, పచ్చి శనగపప్పు - అర స్పూన్.
తయారీవిధానం:
-- స్టవ్ ఆన్ చేసి నూనె వేసి, గాటు పెట్టిన పచ్చిమిర్చిని వేసి ఒక ఐదు నిముషాలు వేపుకోవాలి.
-- ఆ తరవాత అందులో బీరకాయ తొక్కలను వేసి మగ్గేంత వరకు మూతపెట్టాలి.
-- మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక పావుగంట ఆగిన తరవాత అందులో టమాటోను చిన్న ముక్కలుగా చేసి వెయ్యాలి.
-- టమాటో కూడా మగ్గిన తరవాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
-- ఈ మిశ్రమానికి కాస్తంత జీలకర్ర, ఉప్పు చేర్చి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
-- స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి, నూనె వేసి, కాగాక జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లి వేసి పచ్చడికి తాలింపు పెట్టుకుంటే, రుచికరమైన బీరకాయ తొక్క పచ్చడి రెడీ.