తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ఒక విద్యార్థి అరెస్ట్ కలకలం రేపింది. ఆంబూరుకి చెందిన అనార్ అలీ ఆర్కాడు దగ్గర్లోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. శనివారం ఢిల్లీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ పోలీసులు, వేలూరు ఇంటెలిజెన్స్ పోలీసుల సాయంతో అనార్ అలీ ఇంటిని చుట్టుముట్టారు. ఇతర దేశాల్లోని కొందరితో నిందితుడికి పరిచయం ఉందని, వీరిలో ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిసింది.