ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్. బి అంజాద్ బాషా అన్నారు. ఆదివారం కడప శంకరాపురం లోని బ్లైండ్ స్కూల్ సమీపంలో మెహతాబ్ ఆస్పత్రిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్. బి అంజాద్ బాషా, నగర మేయర్ కే సురేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేద ప్రజల కొరకు అనేక వైద్య ఆరోగ్య సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని వాటిని పేద ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. అలాగే వైద్యులు పేద ప్రజలకు వైద్య సేవలు అందించే స్వభావం కలిగి ఉండాలని వైద్య వృత్తి పూజింప తగ్గ వృత్తి అని అన్నారు.