జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటిలో నూతనంగా నిర్మించిన శ్రీ గణపతి సుబ్రహ్మణ్య శ్రీ చక్ర సహిత రాజరాజేశ్వరి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ ఉత్సవాలు ఆదివారం ఘనంగా ముగిసాయి. మూడు రోజులపాటు జరిగిన ఈ ఉత్సవాల్లో చివరి రోజు ఉదకశాంతి, చండీ హోమం, కళ హోమాలు, మూల మంత్ర హోమాలు, నీరాజన మంత్రపుష్పాలు, చతుర్వేద స్వస్తి ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా చుట్టు ప్రక్కల గ్రామాల భక్తులు అమ్మవారిని దర్శించుకోని పూజలు నిర్వహించి తీర్ద ప్రసాదాలు స్వికరించారు.
విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ ప్రతినిధులు వివిధ రకాల పూలదండలతోనూ, విద్యుత్ దీపాలతోనూ అమ్మవారి ఆలయాన్ని అందంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖ రాంకీ ఫార్మసిటీ ప్రతినిధులు డాక్టర్ పిపి లాల్ కృష్ణ, ఈశ్వర్ రెడ్డి, దివాకర్, తదితరులు కుటుంబ సమేతంగా ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోర్చనల మధ్య హోమాలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. భక్తులకు ఆలయం వద్ద తులసి మొక్కలను విశాఖపట్నం ఫార్మా సిటీ ప్రతినిధులు ఉచితంగా అందజేశారు.