అపార్ట్మెంట్ మేడపై నుండి జారిపడి యువతి మృతి చెందిన ఘటన ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్ఏడి కూడలి సుసర్ల కాలనీ కి చెందిన యువతి కోన పూజిత ( 19 ) శ్రీ సౌదా అపార్ట్మెంట్ లో తల్లి కోన సుజాతా తో కలిసి నివాసం ఉంటుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి తన సోదరి తో కలిపి మేడ పై పిట్ట గోడ మీద కూర్చుని ఫోన్ మాట్లాడుతుంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నాలుగంతస్తుల పై నుండి జారి కింద పడిపోయింది. ఘటనలో ఆమె కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి మృతురాలి తల్లి సుజాత ఫిర్యాదు మేరకు సీఐ సిహెచ్ ఉమాకాంత్ నేతృత్వంలో హెచ్ సీ సుబేదర్ బేగం ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.