విశాఖ లో మార్వడి యువ మంచ్ అధ్వర్యంలో లో కావడి యాత్ర ఘనంగా సాగింది. వేలాది మంది కాసాయి వస్త్రాలు ధరించి మాదవదార నుండి వుత్కల్ జగన్నాద్ స్వామి ఆలయం వరకు కావిడి యాత్ర నిర్వహించారు. మాధవదార కొండలలో గల స్వచ్చమైన నీళ్ళు శ్రావణ మాసం లో శివుడు కి అభిషేకం చేస్తే చల్లగా చూస్తాడని భక్తుల విశ్వాసం. యాత్ర లో సమారు 2 వేల వరకు మార్వాడీలు పాల్గొని దారి పొడుగునా శివునికి బం బోలే అంటూ నినాదాలు చేస్తూ శివుడి రథం వెనుక యాత్ర సాగించారు.
ప్రతి ఏటా శ్రావణ మాసం అమావాస్య తర్వాత వచ్చే మొదటి ఆదివారం మర్వడీలు ఈ కావిడి యాత్ర చేస్తారు. 2 సంవత్సరాలు కరోనా కారణంగా యాత్ర కొనసాగలేదు. దీంతో ఈ సంవత్సరాలు అధిక సంఖ్యలో భక్తులు యాత్ర లో పాల్గొన్నారు. ఈ సంవత్సరాలు మార్వాడీలు తో పాటు సిందీ, రాజస్థానీ , తెలుగు వారు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాధవ దార నుండి జగన్నాద్ స్వామి ఆలయం వరకు 14 కిలోమీటర్లు చెప్పులు వేసుకోకుండా భక్తులు యాత్రలో పాల్గొంటారు.