మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం మండలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఉచిత బియ్యం చౌక దుకాణాలలో ఆగస్టు 1వ తేదీ నుండి పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తాసిల్దార్ ప్రేమంత్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మంగారిమఠం మండలానికి 11, 395 రేషన్ కార్డులు ఉన్నాయని వీరందరికీ 16 రేషన్ షాపుల నుండి ఈ బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని, ఇప్పటికే వాలంటరీ ద్వారా కూపర్లు పంపిణీ చేశామన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి ఉచిత బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడంతో నేటి నుండి అవి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. వాలంటీర్లు రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇంటి దగ్గరనే కూపన్లు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. రేషన్ పంపిణీలో అవకతవకలు జరిగిన వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.