రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పరిపాలనలో ప్రజలు సంతోషకరమైన జీవనం సాగిస్తున్నారని పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ అన్నారు. పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలంలోని గురజాడ గ్రామంలో సోమవారం సూర్యోదయం ముందే పింఛన్లు పంపిణీ చేస్తూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పామర్రు నియోజకవర్గ శాసనసభ్యుల
కైలే అనిల్ కుమార్. ఈ సందర్భంగా శాసనసభలు మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు వివరించారు. గడప గడపకు వెళ్లిన సమయంలో ప్రతి ఇంటా జగన్మోహనరెడ్డి సంక్షేమ పథకాల లబ్దితో వారి కుటుంబాలకు లభించిన ఆర్థిక భరోసా పట్ల లబ్ధిదారులంతా వైసీపీ ప్రభుత్వం పట్ల తమ సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. టీడీపీని బ్రతికించటానికి ఎల్లో మీడియా ప్రయత్నం చేస్తున్నా ఆ పార్టీని రాష్ట్ర ప్రజలు మరిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.