ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలసంఘం బృందం సందర్శించింది. ముగ్గురు సభ్యుల బృందం ఆదివారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని అక్కడ ఎగువ కాఫర్ డ్యామ్ ను పరిశీలించింది. కాగా, పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మళ్లీ ఇటీవల వరదలు వస్తే భద్రాచలం పూర్తిగా మునిగిపోతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై సీడబ్ల్యూసీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలసంఘం బృందం సందర్శించి పూర్తి వివరాలు సేకరించినట్లు తెలుస్తుంది.