విజయవాడలో ఫొటోగ్రఫీ కార్నివాల్, ఫొటోగ్రఫీ ఎక్స్ పో కార్యక్రమంలో మంత్రి రోజా సందడి చేశారు. 3 వేల మంది ఫొటోగ్రాఫర్లు ఏకకాలంలో మంత్రి రోజాను ఫొటో తీశారు. ఈ అరుదైన ఘట్టం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఇంతమంది ఫొటోగ్రాఫర్లు ఒకే వేదిక పైకి రావడం సంతోషం కలిగించిందని, వాళ్లందరూ ఒకసారి ఫొటో తీయడం మరుపురాని అనుభూతి కలిగించిందని మంత్రి రోజా మీడియాతో అన్నారు.