ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ మరియు బెటర్‌మెంట్ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది 6,15,908 మంది పరీక్షలు రాయగా 2,01,627 మంది ఫెయిలయ్యారు. 20 ఏళ్ల తర్వాత ఏపీలో అత్యల్ప ఉత్తీర్ణత శాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 71 పాఠశాలల్లో ఒక్కటీ ఉత్తీర్ణత సాధించలేదు.