సల్మాన్ కు గ్యాంగ్ స్టర్ గ్రూపుల నుంచి ముప్పు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో తన ప్రాణాలకు ముప్పు ఉందని, గన్ లైసెన్స్ మంజూరు చేయాలని కోరుతూ సల్మాన్ ఖాన్ దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు తుపాకీ లైసెన్స్ మంజూరైంది. ఇదిలావుంటే ఇదే విషయమై జులై 22న ముంబై పోలీసు కమిషనర్ ను కలుసుకున్నాడు. ఏ ఆయుధానికి లైసెన్స్ ఇచ్చారన్నది తెలియలేదు. ఒక వ్యక్తి రక్షణ కోసం పాయింట్ 32 క్యాలిబర్ రివాల్వర్ లేదా పిస్టల్ కొనుగోలు చేసుకోవచ్చని నిపుణులు తెలిపారు.
సల్మాన్ ఖాన్ నివాసం ఉండే డీసీపీ జోన్ 9కు ఆయుధ లైసెన్స్ దరఖాస్తును పంపించారు. జోనల్ డీసీపీ నిరభ్యంతరం వ్యక్తం చేయడంతో లైసెన్స్ మంజూరైంది. కృష్ణ జింకను వేటాడినందుకు క్షమాపణ చెప్పాలని, లేదంటే అందుకు తగిన శిక్ష అనుభవించాల్సి వస్తుందంటూ ఆయనకు లోగడ బెదిరింపులు వచ్చాయి. ఒక బెదిరింపు లేఖను కూడా అందుకున్నారు. ‘‘మూసేవాలా (హత్యకు గురైన పంజాబీ గాయకుడు)కు పట్టిన గతే నీకు కూడా పడుతుంది’’ అంటూ ఆ లేఖలో హెచ్చరిక ఉంది.