రాజస్థాన్ రాష్ట్రంలో మంకీపాక్స్ అనుమానిత కేసు తాజాగా వెలుగుచూసింది. 20 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అతడి నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్ష కోసం పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారని రాజస్థాన్ హెల్త్ యూనివర్శిటీ అధికారి చెప్పారు. కిషన్ ఘడ్ పట్టణానికి చెందిన యువకుడికి మంకీపాక్స్ లక్షణాలుండటంతో అతని కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి పరిశీలనలో ఉంచామని వైద్యులు చెప్పారు.