కలకడ మండలంలో 295 మందికి కొత్తగా మంజూరైన పెన్షన్లను పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి పంపిణీ చేశారు. సోమవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్ వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పధకం వాలంటీర్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో జరుగుతోందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.