కరోనా వైరస్ మరోసారి మనదేశంపై పగడవిప్పందన్న వార్తల నేపథ్యంలో ఊరాటనిచ్చే ప్రకటనను కేంద్రంచేసింది. దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య ప్రస్తుతం అదుపులోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. గత కొద్దిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ 20 వేల మార్క్ దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య ఇవాళ 13 వేలకు తగ్గింది. తాజాగా 4.11 లక్షల మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 13,734 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా 13,734 మంది కోవిడ్ పాజిటివ్‌గా నమోదు కాగా.. వైరస్ బారిన పడి 27 మంది మృత్యువాత పడ్డారు. 17 వేల మందికి పైగా కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కంటే కోలుకున్న వారే ఎక్కువగా ఉన్నారని ఆరోగ్య శాఖ చెప్పింది. రికవరీ రేటు 98.49 శాతంగా ఉంది. ఇప్పటివరకు 4.4 కోట్ల మందికి వైరస్ సోకగా.. 4.33 కోట్ల మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 204.6 కోట్ల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.