మడకశిర: రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరకులు, డీలర్ల వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సోమవారం టిడిపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ ఆనంద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు భక్తర్, పట్టణ అధ్యక్షుడు మనోహర్, కార్యదర్శి పుల్లయ్య చౌదరి, కౌన్సిలర్లు నరసింహరాజా, శ్రీనివాసులు పాల్గొన్నారు.