తాడపత్రి నియోజకవర్గ పరిధిలోని పెద్దపప్పూరు మండలంలో వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కొట్టాలపల్లి గ్రామానికి చెందిన హరీష్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం అనంతపురం కుతరలించారు.