ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రధమ సంవత్సరం డిగ్రీ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. దీనికి సంబంధించిన వివరాలు వంట్లమామిడి గ్రామానికి చెందిన గిన్నిపల్లి నాగరత్నం (19) పాడేరు డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి ఏడాది చదువుతుంది. విద్యార్థినికి కుటుంబ సభ్యులు మేనరిక పెళ్ళి సంబంధం చేసి, మేన బావకు ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయముగా చేశారు. విద్యార్థినికి నాగరత్నం వేరే అబ్బాయితో ప్రేమ వ్యవహారం ఉందని, సమాచారం, ప్రేమించిన అబ్బాయికి దూరం అవుతాను. అనే బాధతో తన గ్రామం సమీపంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కుటింబికులు ఇచ్చిన సమాచారం మేరకు పాడేరు పోలీసులకు పిర్యాదు చేయగా కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించారు.