మహిళా ఎంపీలకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విందు ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా వర్షాకాల సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఆయన పలు పార్టీలకు చెందిన మహిళా ఎంపీలకు తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు.
డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు గల్లా నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణకుమారి, సోదరి డాక్టర్ గౌరినేని రమాదేవి తదితర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను గల్లా జయదేవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa