టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీ, క్యూలకు స్వస్తి పలికేందుకు దేశంలోని టోల్ ప్లాజాల స్థానంలో కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్యసభకు తెలిపారు.వచ్చే ఆరు నెలల్లో కొత్త విధానాన్ని ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి తెలిపారు.అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతికతను త్వరలో ఎంపిక చేస్తామని గడ్కరీ చెప్పారు.ఫాస్ట్‌ట్యాగ్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, టోల్ ఆదాయం ఒక్క రోజులో రూ.120 కోట్లకు గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు 5.56 కోట్ల ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ చేశామని, దీని వ్యాప్తి 96.6 శాతంగా ఉందని ఆయన చెప్పారు.