గత నెల 18న సీఎం వైయస్ జగన్ ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలకు వర్క్‌షాప్ నిర్వహించారు. లక్షలాది కుటుంబాలు వైయస్ఆర్‌సీపీపై ఆధారపడ్డాయని, ఆ కుటుంబాలకు న్యాయం జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తిరిగి అధికారంలోకి రావాలని సీఎం వైయస్ జగన్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.
2019 ఎన్నికలకంటే మెరుగైన ఫలితాలతో అధికారంలోకి రావాలని, అది కష్టం కానే కాదని స్పష్టంచేశారు. ఆగస్టు 4 నుంచి నియోజకవర్గాల వారీగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల కార్యకర్తలతోనూ సమావేశమై దిశానిర్దేశం చేస్తానని ప్రకటించారు. నెలకు 10 నుంచి 15 నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం కానున్నారు. తొలి సమావేశం గురువారం సాయంత్రం కుప్పం నియోజకవర్గానికి చెందిన 60 మంది కార్యకర్తలతో జరుగుతోంది.