తన భర్త శాడిజాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ మూడునెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. బాలాపూర్ కు చెందిన ఫిరోస్ అన్సారీ అనే మహిళకు సుల్తాన్ తో గతేడాది వివాహమైంది. మొదట్నుంచి భార్యను అనుమానిస్తూ బెల్టు, కర్రతో చితకబాదేవాడు. మూడ్రోజుల కిందట పుట్టింటికి వచ్చిన మహిళ, భర్త ఆగడాలను తట్టుకోలేక, తన శవాన్ని కూడా భర్త, అత్తమామలు ముట్టుకోకూడదని సూసైడ్ నోట్ రాసి బుధవారం ఉరివేసుకుని చనిపోయింది.