ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. తన తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ పేరును జస్టిస్ ఎన్వీ రమణ గురువారం సిఫారసు చేశారు. ఈ నెల 27న జస్టిస్ లలిత్ సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.