తాగిన మత్తులో వేడి వేడి సాంబారు గిన్నెలో పడి ఓ వ్యక్తి మరణించాడు. తమిళనాడులోని మధురై జిల్లా పలంగానట్టిలో గ్రామ దేవత ఉత్సవాల సందర్బంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్కడికి తాగిన మత్తులోవచ్చిన ముత్తుకుమార్ సాంబారు గిన్నె పైకి ఎక్కి కూర్చొని అందులో పడ్డాడు. 65 శాతం శరీరం కాలిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వారం క్రితం ఈ ఘటన జరిగినట్టు సమాచారం.