కర్ణాటకలో మార్చి 9న జరిగిన హత్య కేసు గుట్టు వీడింది. మైసూరు జిల్లా నంజగూడులో సులోచన (45) హిందీ టీచర్‌గా చేస్తోంది. భర్త చనిపోయిన తర్వాత మురుగేష్ అనే వ్యక్తికి దగ్గరైంది. మురుగేష్ భార్య గాయత్రి కార్పొరేటర్‌గా ఎన్నికైంది. తన భర్తతో ఎఫైర్ మానుకోవాలని సులోచనను పలుమార్లు గాయత్రి హెచ్చరించింది. వినకపోవడంతో సులోచనను ఆమె గొంతు పిసికి హత్య చేసింది. గాయత్రిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.