75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ముందున్న నేపథ్యంలో దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాల హెచ్చరించాయి. ఈ క్రమంలో కాశ్మీర్ లో నాన్ లోకల్స్ ని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం పుల్వామా జిల్లాలోని గుదూరాలో గ్రెనెడ్ దాడి చేశారు. ఈ దాడిలో బీహార్ కు చెందిన ఓ కూలీ మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.