టీ తాగితే మెదడు చురుగ్గా పని చేస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపుని తగ్గిస్తుంది. టీలోని మూలకాలు బ్రెస్ట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిలువరిస్తాయి. పొట్టలోని భాగాలకు వచ్చే క్యాన్సర్లను, చర్మ సంబంధించిన క్యాన్సర్‌లను టీ తగ్గిస్తుంది. టీ లోని ఫ్లోరైడ్ దంత క్షయాన్ని తగ్గిస్తుంది. బ్లాక్ లేదా గ్రీన్ టీ తాగితే నోటిలోని హానికర బ్యాక్టీరియాకు చెక్ పెట్టొచ్చు. టీ రక్తపోటును కూడా తగ్గిస్తుంది.