ఒక రాష్ట్ర పరిధిలో రాజధానుల ఏర్పాటుపై ఆ రాష్ట్ర శాసనసభకు విస్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు.
రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా ఒకటి అంతకంటే ఎక్కువ రాజధానుల ఏర్పాటు చేసే అధికారం వాస్తవానికి ఆయా రాష్ట్ర శాసన వ్యవస్థకే ఉందన్నారు. అయితే దీనిపై మరింత స్పష్టత కోరుతూ ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్దంగా తిరుగులేని అధికారం కల్పించే ఉద్దేశంతో ఆర్టికల్ 3ఏని చేరుస్తూ రాజ్యాంగ సవరణ చేపట్టడం ఈ బిల్లు ఉద్దేశంగా ఆయన పేర్కొన్నారు.