అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారధిరెడ్డి డిమాండ్ చేశారు. వేములలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశప్రజలు దేవాలయంగా భావించే అత్యున్నత స్థాయి పార్లమెంటులో సభ్యుడిగా ఉంటూ మహిళ పట్ల నగ్నంతో వీడియోకాల్ ద్వారా వ్యవహరించడం సభ్య సమాజం తలదించుకుంటోందన్నారు. చేసిన తప్పు చాలదన్నట్లు ఆ తప్పును విపక్షపార్టీలపై రుద్దడం దుర్మార్గమన్నారు. రాసలీలలు వైసీపీకే చెల్లుతాయన్నారు.
మహిళ పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన మాధవు సస్పెండ్ చేయడంతో పాటు పదవి నుంచి తొలించేలా చర్యలు చేపట్టాలని పార్థుడు డిమాండ్ చేశారు. వైసీపీ మొదటి నుంచి నేరచరితులను, అక్రమార్కులను, అవినీతి పరులను పెంచిపోషిస్తూనే ఉందన్నారు. గతంలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, అనిల్ కుమార్యాదవ్లు ఇరువువు కలిసి అసెంబ్లీలో అసభ్యకరంగా ప్రవర్తించినప్పుడు, అలాగే పృధ్వీరాజ్, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసులు మరొకొందరు వైసీపీ నేతలు మహిళల పట్ల ఫోన్ల ద్వారా గలీజు వ్యవహారాలకు పాల్పడినట్లు మీడియా ద్వారా వైరల్ అయ్యాయన్నారు.
అప్పుడే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని ఉంటే ఆ పార్టీకి నేడు ఈ దుస్థితి వచ్చేదికాదన్నారు. మహిళల పక్షపాతి అని పదేపదే చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించిన మాధవ్ ను వెంటనే చర్యలు తీసుకోవాలని పార్థసారధిరెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడు రెడ్డి విశ్వేశ్వర్రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జులు గంగాధర్రెడ్డి, బయపురెడ్డి, వసంతరెడ్డిలు పాల్గొన్నారు.