ఇస్రో ఆదివారం ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగం సందిగ్ధంలో పడింది. మూడో దశ తర్వాత ఈఓఓస్-2, ఆజాదీ ఉపగ్రహాలను కక్ష్యలోకి రాకెట్ వదిలింది. అయితే సాంకేతిక లోపంతో ఉపగ్రహాల నుంచి కంట్రోల్ సెంటర్కు సిగ్నల్ అందడం లేదని ఇస్రో తాజాగా ప్రకటించింది. సిగ్నల్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. రాకెట్ గమనాన్ని విశ్లేషిస్తున్నట్లు పేర్కొన్నారు.