యూపీలోని మధుర సిటీలో దారుణం జరిగింది. మే 28న అంగన్వాడీ వర్కర్ పోస్టు కోసం ఫారం నింపేందుకు ప్రజాసేవా కేంద్రానికి ఓ మహిళ వెళ్లింది. ఆమెపై సెంటర్ నిర్వాహకుడు, కంప్యూటర్ ఆపరేటర్, మరో ఇద్దరు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణాన్ని వీడియో తీశారు. తాజాగా ఆ వీడియోను బాధితురాలి అత్తమామలకు పంపించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను శనివారం అరెస్ట్ చేశారు.