దేశవ్యాప్తంగా భారీగా నకిలీ ఓటర్లను ఎన్నికల కమిషన్ ఏరిపారేసింది. గత కొంతకాలంగా ఓటర్ల సమగ్ర డిజిటల్ జాబితాపై దృష్టి పెట్టిన ఎన్నికల కమిషన్.. నకిలీల ఏరివేతను ప్రాధాన్య అంశంగా తీసుకుని చర్యలు అమలు చేసింది. ఈ క్రమంలో ఒకే పేరుతో ఒకటికి మించి ఉన్న 9,27,853 ఓటర్ల పేర్లను తొలగించింది. ఇక ఫొటోలు ఒకే రీతిలో ఉన్న 98,00,412 ఓట్లను తొలగించినట్టు తెలిపింది.