బీహార్లో గతకొంత కాలంగా రాజకీయ గందరగోళం నెలకొంది. సీఎం నితీష్ కుమార్ బీజేపీపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎన్డీఏ నుంచి జేడీయూ చీలిపోతుందన్న ఊహాగానాలకు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సీఎం నితీష్ కుమార్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలందరితో కీలక భేటీ ఏర్పాటు చేశారు. భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్య నేతలతో సంప్రదించి నితీశ్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది.