యూపీకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడి కారును ఓ ట్రక్కు ఢీకొట్టి అర కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ఘటన మెయిన్‌పురి నగరంలో ఆదివారం రాత్రి జరిగింది. రోడ్డుపై వేగంగా వస్తున్న ఓ భారీ ట్రక్కు సమాజ్ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవేంద్రసింగ్ యాదవ్ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. అనంతరం 500 మీటర్ల దూరం కారును ట్రక్కు ఈడ్చుకెళ్లింది. కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.