దేశంలో ఇంటర్నెట్ సేవల నిలిపివేతలపై కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ సోమవారం కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. 2021లో ప్రపంచవ్యాప్తంగా 182 ఇంటర్నెట్ షట్డౌన్లు అయితే భారత్‌లోనే 106 ఉన్నాయన్నారు. ఇంటర్నెట్ సస్పెన్షన్ల నియంత్రణకు కేంద్రం ఏదైనా చట్టం రూపొందిస్తోందా? అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం మణిపూర్‌లోనూ 5 రోజుల ఇంటర్నెట్ బంద్ కొనసాగుతోందని గుర్తుచేశారు.