పోటుమెరక గ్రామంలో పాముకాటుతో రేపల్లె పున్నారావు(42) అనే వ్యక్తి మృతి చెందాడు. గడ్డివామును సర్దే క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. దీంతో పున్నారావు కుటుంబ సభ్యులు రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యం నిర్ధారించారు. భార్య సత్యవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చోడాయపాలెం ఎస్సై శివప్రసాద్ తెలిపారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.