రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ జిల్లా కోట్పుట్లీ పట్టణంలో కొత్త కోడలు ఊహించని షాక్ ఇచ్చింది. పట్టణానికి చెందిన యువకుడికి అదే ప్రాంతానికి చెందిన యువతితో ఇటీవల పెళ్లైంది. ఫస్ట్ నైట్ రోజు భోజనంలో మత్తు మందు కలిపి అందరికీ ఆమె వడ్డించింది. ఇంట్లోని డబ్బు, నగలతో పరారైంది. తర్వాతి రోజు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇలాంటి మోసాలు ఆమె ఇప్పటికే చేసినట్లు తేలింది. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.