తణుకు నియోజక వర్గం దువ్వకు చెందిన దివ్యాంగ దంపతులు పంతాడి జనార్ధన రావు, శ్రీమతి లక్ష్మీదుర్గ భీమవరంలో నిర్వహించిన జనవాణిలో తమ బాధలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి విన్నవించారు. చలించిన పవన్ కళ్యాణ్ తక్షణం ఆర్థిక సాయం చేశారు.
తదేకం ఫౌండేషన్ ద్వారా ట్రై సైకిల్స్ అందించే ఏర్పాటు చేశారు. శ్రీ పంతాడి జనార్ధన రావు, శ్రీమతి లక్ష్మీదుర్గ దంపతులకు వాటిని తణుకు నియోజక వర్గం జనసేన ఇంచార్జ్ శ్రీ విడివాడ రామచంద్ర రావు, వీర మహిళ ప్రాంతీయ సమన్వయకర్త శ్రీమతి కాట్నం విశాలి అందచేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జన సైనికులు ఆ దివ్యాంగ దంపతులకి రూ.6 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో తణుకు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ చిక్కాల వేణు, పార్టీ నేతలు పాల్గొన్నారు.