వైసీపీ నేతల నీచ రాజకీయాలు ఇలా ఉంటాయి అని టీడీపీ నాయకులూ ఒక వీడియో సోషల్ మీడియాలో చూపిస్తూ మాట్లాడారు. వివరాల్లోకి వెళ్ళితే .... గడప గడపకూ వాళ్ళ నేతలను ఛీకొడుతుంటే తట్టుకోలేక కుట్రకు ప్లాన్ చేసారు. బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో ఒక మహిళను పంపి టిడిపి నేతలను అడ్డుకునేలా చేసారు.
ఆ వీడియోను ప్రచారానికి వాడుకుంటూ వైసీపీ శ్రేణులు పైశాచిక ఆనందం పొందుతుంటే... సదరు మహిళా ఆవేదనకు గురయ్యింది. ప్రభుత్వ పథకాలు, ఇంటిస్థలం, బిల్లులు రాకుండా చేస్తామని బెదిరించి వైసీపీ నేతలు తనతో అలా చేయించారని ఆ మహిళ చెప్పింది అని రెండో వీడియో చూపించారు.