పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి సీబీఐ షాకిచ్చింది. దీదీ అత్యంత సన్నిహితుడైన బీర్బూమ్ టీఎంసీ అధ్యక్షుడు అనుబ్రతా మోండల్‌ను గురువారం సీబీఐ అరెస్ట్ చేసింది. బీర్భూమ్లోని అతని నివాసంలో సీబీఐ అనుబ్రతాను అదుపులోకి తీసుకుంది. పశువుల అక్రమ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అరెస్ట్ చేసింది. 2020లో సీబీఐ పశువుల అక్రమ రవాణా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుబ్రతా ఉన్నారు.