నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై ఆయన సోదరి కిమ్ యో జోంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ వ్యాప్తి సమయంలో తన సోదరుడు జ్వరంతో బాధపడ్డారని.. పరిస్థితి విషమించిందని ఆమె వెల్లడించారు. అయితే, కిమ్ కరోనా వచ్చిందా? లేదా? తెలపలేదు. నార్త్ కొరియాలో కరోనా వ్యాప్తిపై సౌత్ కొరియా తప్పుడు ప్రచారం చేసిందని ఆమె ఆరోపించారు. దక్షిణ కొరియా అధికారులను నాశనం చేస్తామని సంచలన కామెంట్స్ చేశారు.