ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ ను ఈ నెల 26 వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు అనంతబాబును తరలించారు.ఈ కేసులో పోలీసులు ఇంకా చార్జీషీట్ దాఖలు చేయలేదు.రిమాండ్ పొడిగించడంతో అనంతబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఈ ఏడాది మే 20వ తేదీన ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్ గా పనిచేసి మానేసిన సుబ్రమణ్యం హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ఎమ్మెల్సీ అనంతబాబు కారణమని పోలీసులు అరెస్ట్ చేశారు. సుబ్రమణ్యం అనుమానాస్పద స్థితి మృతి కేసుకు సంబంధించి సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకుు పోలీసులు కేసు నుమోదు చేశారు. సుబ్రమణ్యాన్ని పద్దతి మార్చుకోవాలని మందలించే క్రమంలో చేుయి చేసకోవడంతో సుబ్రమణ్యం కింద పడడంతో తలకు గాయం కావడంతో మరణించినట్టుగా పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే ఈ కేసులో దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారని విపక్షాలు ఆరోపణలు చేశాయి. ఈ కేసు విషయమై పోలీసుల తీరును విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి.
ఈ కేసులో అరెస్టైన అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు. బెయిల్ మంజూరు చేయాలని ఆయన గతంలో కోర్టుల్లో బెయిల్ పిటిసన్లు దాఖలు చేశారు. అయితే అనంతబాబు బెయిల్ పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయి. దీంతో అనంతబాబు జైల్లోనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేయలేదు. 90 రోజుల్లోపుగా చార్జీషీట్ దాఖలు చేయకపోతే బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది.